‘మైసూర్ పాక్ తింటే క‌రోనా న‌య‌మ‌వుతుంది’.. స్వీట్ షాప్‌కు సీల్

చెన్నై: త‌న స్వీట్‌ షాప్‌లో త‌యారుచేసిన మైసూర్‌ పాక్ తింటే కరోనా నయమవుతుందని ప్రకటించిన వ్యక్తి యొక్క దుకాణానికి అధికారులు సీల్‌ వేశారు. కోయంబత్తూరు జిల్లా తొట్టిపాళెయంలో ఉన్న తిరునెల్వేలి లాలా స్వీట్ షాప్ యజమాని.. తన షాప్‌లో త‌యారుచేసే ఔషధ గుణాలు ఉన్న మైసూర్‌ పాక్‌ తింటే కరోనా ఒకే రోజులో నయం అవుతుందని తెలిపి మూడు నెలలుగా విక్రయాలు చేస్తున్నట్లు ప్రకటనలు ఇచ్చాడు.

తన తాత సిద్ధ వైద్యం నేర్పించాడని, ఆ నిబంధనల ప్రకారం ఔషధ విలువ‌లున్న‌ మైసూర్‌ పాక్‌ తయారు చేస్తున్నట్లు తెలిపాడు. ఇది తింటే వ్యాధి నిరోధక శక్తి పెరిగి కరోనా తగ్గుతుందని చెప్పాడు. దీనికి సంబంధిన ప్రకటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అది తెలుసుకున్న ఆహార, ఆరోగ్యశాఖ అధికారులు, వైద్యులు ఆ స్వీట్‌ షాప్‌కు చేరుకున్నారు. అనంతరం షాప్ యజయాని వద్ద వివరాలు సేకరించారు. ప్రభుత్వం అనుమతి లేకుండా ఇలా చేయడం తప్పని పేర్కొన్నారు. దుకాణానికి సీల్ వేసి, మొత్తం 120 కిలోల మైసూర్‌ పాక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Latest Updates