ఉద్యోగుల డిమాండ్లపై సీఎస్ ను కలవనున్నటీఎన్జీవో

ఉద్యోగుల సమస్యలపై ఆందోళనకు సిద్దమవుతోంది టీఎన్జీవో. ఉద్యోగుల డిమాండ్లపై ఇవాళ భేటీ అయిన టీఎన్జీవో నేతలు తమ సమస్యల పరిష్కారం కోసం సీఎస్ ఎస్. కే. జోషిని కలవాలని నిర్ణయించారు.  సీఎస్ ను కలిసిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే భవిషత్ కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఐదేళ్లయిన తమ సమస్యలను పరిష్కరించడం లేదన్నారు ఉద్యోగులు. హెల్త్ స్కీం, పీఆర్ సీ, ఐఆర్, సీపీఎస్ రద్దు వంటి సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త జిల్లాలో ఉద్యోగులను ఆర్డర్ టూ సర్వ్ ద్వారా ఎంపిక చేసినా ఇప్పటికీ పర్మినెంట్ పోస్టింగులు ఇవ్వలేదన్నారు ఉద్యోగులు.

Latest Updates