14 ఏండ్ల సర్వీస్ ఉన్నా శాలరీ 15 వేలే..

రెగ్యులరైజేషన్ చేయాలని
గాంధీ ఔట్ సోర్సింగ్ నర్సుల ధర్నా
మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టరేట్
ఎదుట నిరసన.. అరెస్ట్
హైదరాబాద్, వెలుగు : ‘‘పద్నాలుగేండ్ల సర్వీస్ ఉన్నా ఉద్యోగానికి భద్రత లేదు. కరోనా రోజుల్లో ప్రాణాలకు తెగించి డ్యూటీ చేస్తున్నా గుర్తింపు లేదు” అంటూ గాంధీ కోవిడ్ హాస్పిటల్ అవుట్ సోర్సింగ్ నర్సులు రోడ్డెక్కారు. జాబ్‌ సెక్యూరిటీ కల్పించాలని ఏడేండ్ల నుంచి పోరాడుతున్నా పట్టించుకోవడం లేదంటూ శుక్రవారం 220 మంది కోఠిలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్‌ ముందు ధర్నా చేశారు. కొవిడ్ స్టాఫ్ నర్సుల రిక్రూట్‌లో సినియార్టీ లేనివారికి రూ.28వేల శాలరీ ఇచ్చారని, తమకు ఇప్పటికీ 15వేలే వస్తుండడంతో కుటుంబాలు గడవడం కష్టంగా మారిందని వాపోయారు. కరోనా కారణంగా ఓనర్లు ఇంటి ఖాళీ చేయమంటున్నారని కన్నీరు పెట్టుకున్నారు. తమకు ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి పలు స్టేషన్లకు తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం

Latest Updates