‘ప్రైవేటు’ ఈఎంఐల నుంచీ వెసులు బాటియ్యాలె

హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీల ఈఎంఐల నుంచి కార్మికులు,పేదలకు వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర‌ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు.

లాక్‌డౌన్‌ వల్ల27 రోజులుగా కుటుంబాలు గడవడమే కష్టమైపోయిందని అన్నారు. బ్యాంకు రుణాలపై ఈఎంఐలను వాయిదా వేసిన సర్కారు, ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీల ఈఎంఐలపై ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. కేరళలో రవాణా రంగ కార్మికులకు నిత్యావసరాలతో పాటు రూ.5 వేలు ఇస్తున్నారని, రాష్ట్రంలోనూ ప్రతి కార్మికుడికీ 5వేలివ్వాలని డిమాండ్ చేశారు.

Latest Updates