స్కూల్ పిల్లలు కోడిపిల్లల్ని పెంచాలి.. రాష్ట్రపతి ఉత్తర్వులు

స్మార్ట్ ఫోన్లకు అడిక్షన్ కాకుండా ఇండోనేషియన్ రాజధాని బాన్ డంగ్ విద్యాశాఖ అధికారులు చికెట్ సాటిన్ అనే పథకాన్ని అమలు చేశారు.  ఆ పథకం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

స్మార్ట్ ఫోన్లను పెద్దలే కాదు పిల్లలూ వదల్లేకపోతున్నారు. ఏడాది నిండక ముందే వాటికి అట్రాక్ట్ అవుతున్నారు. పెరుగుతున్న కొద్ది ట్యాబ్ లు , ల్యాప్ ట్యాప్ లు, సిస్టమ్ లతో ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇంటర్నెట్ ను ఏలేస్తున్నారు. అందులో ఏమున్నాయో ఇట్టే చెప్పేస్తున్నారు. దీన్నో వ్యసనంగా మార్చుకుంటున్నారు. చివరికి వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తల్లిదండ్రుల ఆందోళన , పిల్లల ఆరోగ్యం పై దృష్టి సారించింది ఇండోనేషియా రాజధానికి బాన్ డంగ్ విద్యాశాఖ అధికారులు విచిత్రమైన నిర్ణయం తీసుకున్నారు.

పిల్లలు స్మార్ట్ ఫోన్లకు అడిక్షన్ కాకుండా ఉండేలా స్కూల్లో చదివే విద్యార్ధులు కోడిపిల్లల్ని పెంచాలని పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు.   తొలిసారిగా ఈ పథకాన్ని అమలు చేసేందుకు 2వేల కోడి పిల్లల్ని కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు.

పైలెట్ ప్రాజెక్ట్ లో భాగంగా రాజధానిలో ఉన్న ఎలిమెంటరీ, జూనియర్ హైస్కూళ్లలో చదివే విద్యార్ధులకు కోడిపిల్లల్ని అప్పగించినట్లు,  స్కూల్ అనంతరం కోడిపిల్లల పోషణ చూసుకోవాలని, మరుసటి రోజు స్కూల్ కి వచ్చేటప్పుడు కోడిపిల్లల్ని స్కూల్ కు తీసుకొని వచ్చేలా ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.

దేశ వ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్ ను అమలు చేసేందుకు ఆ దేశ రాష్ట్రపతి జోకో విడోడో సిద్ధంగా ఉన్నారని బాన్ డంగ్ మేయర్ ఓదేడ్ మహ్మద్ డానియల్ చెప్పారు. త్వరలో ఈ పథకం అన్నీ స్కూళ్లలో అమలయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.

స్కూల్ నిబంధనలపై విద్యార్ధుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కోడిపిల్లలతో స్మార్ట్ ఫోన్ల బెడద తప్పిందని అంటున్నారు. కోడిపిల్లల్ని పెంచడం ద్వారా పిల్లల్లో మానవత్వం వెల్లివిరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Latest Updates