కెమిస్ట్రీలో ‘లిథియం బ్యాటరీ’పై రీసెర్చ్‌‌కు నోబెల్

లిథియం అయాన్‌‌ బ్యాటరీని డెవలప్‌‌ చేసిన ముగ్గురు సైంటిస్టులను 2019 ‘కెమిస్ట్రీ’ నోబెల్‌‌ వరించింది. జాన్‌‌ గుడెనఫ్‌‌ (అమెరికా), స్టాన్లీ విట్టింగ్హమ్‌‌ (బ్రిటన్‌‌), అకీరా యోషినో (జపాన్‌‌)లను ఈసారి నోబెల్‌‌ పురస్కారానికి అవార్డు కమిటీ ఎంపిక చేసింది. ఈ ముగ్గురికీ రూ.6.49 కోట్లను సమానంగా అందించనున్నారు. ఆస్టిన్‌‌లోని టెక్సాస్‌‌ వర్సిటీలో గుడెనఫ్‌‌, నగోయాలోని మైజో వర్సిటీలో యోషినో, న్యూయార్క్‌‌లోని బర్మింగ్‌‌హామ్‌‌ వర్సిటీలో విట్టింగ్హమ్‌‌ ప్రస్తుతం పని చేస్తున్నారు. డిసెంబర్‌‌ 10న స్టాక్‌‌హోంలో జరిగే కార్యక్రమంలో కింగ్‌‌ కార్ల్‌‌ 16 చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. నోబెల్‌‌ అందుకోనున్న ఓల్డెస్ట్‌‌ పర్సన్‌‌ గుడెనఫ్‌‌. ‘తక్కువ బరువున్న, మళ్లీ చార్జ్‌‌ చేయగలిగే లిథియం అయాన్‌‌ పవర్‌‌ ఫుల్‌‌ బ్యాటరీలను ఫోన్లు, ల్యాప్‌‌టాప్‌‌లు, ఎలక్ట్రిక్‌‌ వెహికల్స్‌‌లో ఇప్పుడు బాగా వాడుతున్నారు. సోలార్‌‌, విండ్‌‌ ఎనర్జీని స్టోర్‌‌ చేసుకోడానికి ఉపయోగిస్తున్నారు. కార్బన్‌‌ ఫ్రీ సొసైటీకి ఈ బ్యాటరీ ముందడుగు వేసింది’ అని జ్యూరీ చెప్పింది. 1991ల్లో మార్కెట్‌‌లోకి వచ్చింది మొదలు మన జీవితాలను ఈ బ్యాటరీలు మార్చేశాయని పేర్కొంది.

1970ల నుంచి స్టార్ట్‌‌

1970ల్లో ఆయిల్‌‌ తక్కువగా దొరుకుతున్న టైంలో బ్యాటరీని కనుగొనాలని విట్టింగ్హమ్‌‌ ఫిక్స్‌‌ అయ్యారు. ఆ పనిలో పడ్డారు. కొద్దిపాటి లిథియంతో బ్యాటరీ చేసి ఆయన సక్సెస్‌‌ అయ్యారు. కానీ పూర్తి స్థిరంగానైతే చేయలేదు. విట్టింగ్హమ్‌‌ ప్రొటోటైప్‌‌ సాయంతోనే గుడెనఫ్‌‌ బ్యాటరీని మరింత అభివృద్ధి చేశారు. వేరే మెటల్స్‌‌ను వాడారు. ఇంకాస్త సక్సెస్‌‌ అయింది. 4 వోల్టులు స్టోర్‌‌ చేసుకునే కెపాసిటీకి చేరింది. 1985లో లిథియం అయాన్లను స్టోర్‌‌ చేసుకునే కార్బన్‌‌ మెటీరియల్‌‌తో యోషినో బ్యాటరీ చేశారు. డబుల్‌‌ సక్సెస్‌‌ అయింది. కమర్షియల్‌‌గా మార్కెట్లోకి వచ్చింది. మరి లిథియంనే బ్యాటరీలో ఎందుకు వాడారు? అంటే మెటాలిక్‌‌ లిథియం మంచి యానోడ్‌‌గా పని చేస్తుంది. ఎలక్ట్రాన్లను ఈజీగా వదిలేస్తుంది. కానీ ఇది స్పీడ్‌‌గా చర్యను పొందే రసాయనం, అందుకే మొదట్లో చేసిన బ్యాటరీలు పేలేవి. కానీ కార్బన్‌‌ మెటీరియల్‌‌తో దీనికి యోషినో ఫుల్‌‌స్టాప్‌‌ పెట్టారు.

Latest Updates