రాష్ట్రంలో కొత్త‌గా 13 కేసులు

హైద‌రాబాద్: రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఇప్ప‌టికే వెయ్యికి ద‌గ్గ‌ర్లో కేసులు న‌మోదు కాగా.. శుక్ర‌వారం కొత్త‌గా మ‌రో 13 కేసులు న‌మోద‌య్యాయి. ఈ విష‌యాన్ని హెల్త్ మినిష్ట‌ర్ ఈట‌ల రాజేంద‌ర్ తెలిపారు. క‌రోనా అప్డేట్ పై ఆయ‌న మీడియాతో మాట్లాడారు. 24 గంట‌ల్లో 13 కేసులు న‌మోదుకాగా.. తాజా కేసుల‌తో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 983కి చేరింద‌ని చెప్పారు.

663 మంది క‌రోనా బాధితులు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నార‌ని.. ఇప్ప‌టివ‌ర‌కు కోలుకొని 291 మంది డిశ్చార్జ్ అయ్యార‌ని తెలిపారు. అలాగే క‌రోనాతో 25 మంది చ‌నిపోయార‌ని తెలిపిన మంత్రి.. రాష్ట్రంలో ప‌రిస్థితిని అదుపులోకి తీసుకు వ‌చ్చేందుకు అన్ని విధాల ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని తెలిపారు. క‌రోనా పేషెంట్ల‌పై వ‌స్తున్న పుకార్లు న‌మ్మ‌వ‌ద్ద‌ని, వారికి ఆరోగ్య‌క‌ర‌మైన మంచి ఆహారం అందిస్తున్నామ‌ని చెప్పారు హెల్త్ మినిష్ట‌ర్ ఈట‌ల రాజేంద‌ర్.

Latest Updates