తెలంగాణలో కొత్తగా 143 కేసులు.. 8 మంది మృతి

హైదరాబాద్: రాష్ట్రంలో ఇవాళ 143 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 8మంది చనిపోయారు. ఒకరోజులో కరోనాతో ఇంత ఎక్కువ మంది చనిపోవడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 113కు చేరింది. ఇవాళ సాయంత్రం ఐదు గంటలవరకు అందిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3వేల 290కు చేరింది. ఇందులో.. 15వందల యాభై మంది హాస్పిటళ్లలో చికిత్స పొందుతుండగా… 16వందల 27 మంది డిశ్చార్జ్ అయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే శుక్రవారం 116 కేసులు నమోదయ్యాయి.

మిగిలిన కేసుల్లో.. అదిలాబాద్ ‌లో 2, రంగారెడ్డిలో 8, మేడ్చల్‌ లో 2, సంగారెడ్డిలో 2, ఖమ్మంలో 2, మహబూబ్‌ నగర్‌ లో 5, వరంగల్‌ లో 3, కరీంనగర్ ‌లో 2, మంచిర్యాలలో 1 కేసులు నమోదయ్యాయి.

Latest Updates