రాష్ట్రంలో కొత్త‌గా 15 కేసులు: ఒకరు మృతి

హైద‌రాబాద్ :  రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. బుధ‌వారం రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు కొత్త‌గా 15 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదుకాగా.. ఒకరు మృతిచెందారు. ఈ విష‌యాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ బులిటెన్ ద్వారా విడుద‌ల చేసింది.

తాజా కేసుల‌తో రాష్ట్రంలో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 943కి చేరుకున్నాయ‌ని తెలిపింది. ప్రస్తుతం కరోనా బారినపడి 725 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 194 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా.. 24 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇవాళ్టి 15 కరోనా పాజిటివ్ వివ‌రాలు
జీహెచ్ఎంసీ-10
సూర్యాపేట‌-03
గ‌ద్వాల‌- 02

Latest Updates