రాష్ట్రంలో కొత్త‌గా 1,610 కేసులు..9 మంది మృతి

హైద‌రాబాద్:  రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,610 కేసులు న‌మోదుకాగా.. వైర‌స్ తో 9 మంది చ‌నిపోయార‌ని తెలిపింది రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ‌. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 57,142కు చేరగా..42,909 మంది క‌రోనా నుంచి కోలుకున్నార‌ని చెప్పింది. 13,753 మంది చికిత్స పొందుతుండ‌గా..రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 480 మంది వైర‌స్ బారిన‌ప‌డి మ‌ర‌ణించార‌ని తెలిపింది. పాజిటివ్ కేసుల్లో పురుషులు 65.6%, మహిళలు 34.4% నమోదయ్యాయని..గ‌డిచిన 24 గంట‌ల్లో ఒక్క జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 531 కొత్త కేసులు న‌మోద‌య్యాయ‌ని తెలిపింది వైద్యారోగ్య‌శాఖ‌.

Latest Updates