రాష్ట్రంలో కొత్త‌గా 1850 కేసులు..ఐదుగురు మృతి..!

హైద‌రాబాద్:  రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. శ‌నివారం కూడా భారీగా కేసులు న‌మోద‌య్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 1,850 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదుకాగా..మొత్తం కేసుల సంఖ్య 22, 312కి చేరింద‌ని తెలిపింది రాష్ట్ర‌వైద్యారోగ్య‌శాఖ‌. ఇందులో యాక్టివ్ కేసులు 10, 487 ఉన్నాయ‌ని చెప్పింది. శ‌నివారం 1,342 మంది డిశ్చార్జ్ కాగా.. మొత్తం ఇప్ప‌టివ‌ర‌కు 11,537 మంది క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్నారుని తెలిపింది. శ‌నివారం వైర‌స్ తో ఐదుగురు చ‌నిపోగా..ఇప్ప‌టివ‌ర‌కు 288 మ‌ర‌ణాలు సంభ‌వించాయ‌ని తెలిపింది. కొత్త‌గా న‌మోదైన క‌రోనా పాజిటివ్ కేసుల్లో ఒక్క జీహెచ్ ఎంసీ ప‌రిధిలోనే 1,572 కేసులు న‌మోద‌య్యాయ‌ని ఆరోగ్య‌శాఖ బులిటెన్ ద్వారా వెల్ల‌డించింది.

Latest Updates