దేశంలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు

న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకి క‌రోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 19,0148 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు తెలిపింది కేంద్ర వైద్యారోగ్య‌శాఖ‌. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,04,641కి చేర‌గా..ఇందులో 2,26,947 మంది క‌రోనా బాధితులు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నార‌ని వెల్ల‌డించింది. 24 గంట‌ల్లో434 మంది మ‌ర‌ణించ‌గా..మొత్తం చ‌నిపోయిన‌వారి సంఖ్య 17,834కి చేరిన‌ట్లు చెప్పింది. ఇప్ప‌టివ‌ర‌కు 3,59,860 మంది క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్నార‌ని పేర్కొంది. 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా 2,29,588 టెస్టులు చేయ‌గా.. మొత్తం టెస్టుల సంఖ్య‌90,56,173కి చేరింద‌ని తెలిపింది కేంద్ర‌వైద్యారోగ్య‌శాఖ‌.

మ‌రిన్ని వార్త‌ల కోసం

Latest Updates