రాష్ట్రంలో కొత్త‌గా 1,986 కేసులు

హైద‌రాబాద్: రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో 1,986 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా .. వైర‌స్ తో 14 మంది చ‌నిపోయార‌ని శుక్ర‌వారం రాష్ట్ర ఆరోగ్య‌శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 62,703కి చేర‌గా..45, 388 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యార‌ని చెప్పింది. 24 గంట‌ల్లో రాష్ట్ర‌వ్యాప్తంగా 21,380 క‌రోనా టెస్టులు చేశార‌ని..16,796 మంది ట్రీట్ మెంట్ తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించింది. ఇప్ప‌టివ‌ర‌కు 519 మంది చ‌నిపోయార‌ని తెలిపింది వైద్యారోగ్య‌శాఖ‌.

మ‌రిన్ని వార్త‌ల కోసం..

Latest Updates