ఏపీలో ఇవాళ 2432 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో క‌రోనా నమోదు కేసులు ఎక్కువ కావడంతో పాటు.. మృతుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. , నిన్న(మంగ‌ళ‌వారం) 43 మంది, ఇవాళ( బుధ‌వారం) 44 మంది చనిపోయారు. గడచిన 24 గంటల్లో ఏపీ మొత్తం 22 వేల 197 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించగా, వాటిలో 2432 కేసులు పాజిటివ్ గా నిర్ణార‌ణ అయ్యాయి. ఇందులో ఏపీకి చెందిన 2412 మందికి కరోనా నిర్ధారణ కాగా, ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన 20 మందికి కరోనా సోకింది. దీంతో ఏపీలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 35 వేల 451 కి చేరింది.

Latest Updates