రాష్ట్రంలో 400 దాటిన‌ పాజిటివ్ కేసులు

రాష్ట్రంలో క‌రోనా క‌ల‌క‌లం రేపుతోంది. రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. మంగ‌ళ‌వారం మ‌రో 40 మందికి క‌రోనా సోకిన‌ట్లు తెలిపింది వైద్య ఆరోగ్య‌శాఖ‌. దీంతో మొత్తం రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 404కు చేరిన‌ట్లు ప్ర‌క‌టించింది.

ఈ మేర‌కు మంగ‌ళ‌వారం రాత్రి క‌రోనా హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసింది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ‌. ప్రస్తుతం కరోనా నుంచి 45 మంది కోలుకొని డిశ్చార్జ్‌ కాగా..  ప్రస్తుతం 348 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు 11 మంది కరోనాతో మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే.

Latest Updates