ఏపీలో కొత్తగా 60 కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం 60 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో 7902 శాంపిల్స్‌ ను పరీక్షించగా 60 మందికి పాజిటివ్ వచ్చిందని ప్రకటించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1463కి చేరిందని.. ఇందులో యాక్టివ్ కేసులు 1027 ఉన్నాయని తెలిపింది. అలాగే మొత్తం 403 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని చెప్పింది. ఇవాళ క‌రోనాతో ఇద్ద‌రు చ‌నిపోయార‌ని .. దీంతో క‌రోనాతో చ‌నిపోయిన వారి సంఖ్య 33కి చేరింద‌ని తెలిపింది.

కొత్త‌గా న‌మోదైన 60 కేసులు జిల్లాల వారీగా

క‌ర్నూలు – 25
గుంటూరు -19
అనంత‌పురం-06
క‌డ‌ప -06
వైజాగ్ -02
వెస్ట్ గోదావ‌రి- 02

1

Latest Updates