రాష్ట్రంలో ఒక్క‌రోజే 75 కొత్త క‌రోనా కేసులు..ఇద్ద‌రు మృతి

తెలంగాణ‌లో క‌రోనా క‌ల‌క‌లం రేపుతుంది. శుక్ర‌వారం ఒక్క‌రోజే 75 కొత్త క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇవాళ్టి కేసుల‌తో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 229కి చేరింది. అలాగే రాష్ట్రంలో ఇవాళ ఒక్క‌రోజే ఇద్ద‌రు మృతి చెంద‌గా.. మొత్తం మృతుల సంఖ్య 11కి చేరింది.

ఇవాళ‌ 15 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా.. మొత్తం రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 32 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో ప్ర‌స్తుతం హాస్పిట‌ల్స్ లో చికిత్స పొందుతున్న క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 186గా ఉన్న‌ట్లు శుక్ర‌వారం రాత్రి వైద్య ఆరోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది.

Latest Updates