రాష్ట్రంలో కొత్త‌గా 945 కేసులు

హైద‌రాబాద్ : రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో 945 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయని వైద్యారోగ్య‌శాఖ తెలిపింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం కేసుల సంఖ్య 16, 339కి చేరగా..ఇందులో యాక్టివ్ కేసులు 8,785 ఉన్నాయ‌ని చెప్పింది. మంగ‌ళ‌వారం 1,712 మంది డిశ్చార్జ్ కాగా మొత్తం 7,294 మంది క‌రోనా నుంచి కోలుకున్నార‌ని తెలిపింది. రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 260 సంభ‌వించాయ‌ని వెల్ల‌డించింది ఆరోగ్య‌శాఖ‌.

మంగళవారం GHMC పరిధిలో 869 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా రంగారెడ్డి 29, సంగారెడ్డి 21, మేడ్చల్‌ 13, నిర్మల్‌ 4, కరీంనగర్‌ 2, సిద్దిపేట, సూర్యాపేట, ఖమ్మం, వికారాబాబాద్‌, నిజామాబాద్‌ లో ఒక్కో కేసు నమోదు అయింది. GHMCలో ఇప్పటివరకు 12,682 మంది కరోనా బారిన పడ్డారు. తెలంగాణలో మంగళవారం 3,457 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకూ మొత్తం 88,563 మందికి కరోనా టెస్టులు చేసినట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ ను విడుదల చేసింది.

Latest Updates