కోహ్లీసేనకు చావోరేవో..

ఆస్ట్రేలియా టూర్ లో కోహ్లీ సేనకు ఇవాళ చావో రేవో లాంటి పరిస్థితి. మూడు వన్డేల సిరీస్ లో ఫస్ట్ వన్డేలో ఓడిన భారత్ ఇవాళ జరిగే రెండో వన్డేలో తప్పక గెలవాల్సిన పరిస్థితి వచ్చింది లేకపోతే సిరీస్ చేజారిపోతుంది. ఫస్ట్ వన్డేలో 66 పరుగుల తేడాతో ఓడిన భారత్ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. పాండ్యా, ధవన్ మినహా ఫస్ట్ వన్డేలో ఎవరూ పెద్దగా రాణించలేకపోయింది. టాప్ ఆర్డర్ ,మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ ఖచ్చితంగా బ్యాట్ ఝులిపించాల్సిన అవసరముంది. అదే విధంగా బౌలర్లు తన సత్తా చాటాలి. మొదటి వన్డేలో ఘోరంగా పరుగులిచ్చి ఓటమి పాలయ్యారు. ఈ మ్యాచ్ లో అది రిపీట్ కాకుండా బౌలింగ్ కు పదును పెట్టాలి. కెప్టెన్ కోహ్లీ కూడా తన బ్యాటింగ్ పవర్ ను చూపాలి. ఎందుకంటే విరాట్ కోహ్లీ సిడ్నీ గ్రౌండ్ లో ఆడిన  ఆరు వన్డేల్లో అతను 57 పరుగులే చేశాడు. మరి, మొన్నటి ఓటమి నుంచి కోహ్లీ సేన పుంజుకుంటుందా? నేడు జరిగే సెకండ్ వన్డేలో గెలిచి సిరీస్‌ లో నిలుస్తుందా? చూడాలి

Latest Updates