కృష్ణా జలవివాదాలపై ఇవాళ బుక్​ రిలీజ్

హైదరాబాద్‌‌, వెలుగు: తెలంగాణ ఇంజనీర్స్‌‌ ఫోరం కన్వీనర్‌‌, రిటైర్డ్‌‌ ఇంజనీర్‌‌ దొంతుల లక్ష్మీనారాయణ రాసిన ‘‘షేరింగ్‌‌ ఆఫ్‌‌ కృష్ణా వాటర్‌‌– పోతిరెడ్డిపాడు ఇష్యూ’’ పుస్తకాన్ని శుక్రవారం రిలీజ్​ చేస్తారు. ఖైరతాబాద్‌‌లోని ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ ఇంజనీర్స్‌‌ ఆఫీసులో నిర్వహించే ఈ కార్యక్రమానికి హెచ్‌‌ఆర్సీ చైర్మన్‌‌ జస్టిస్‌‌ చంద్రయ్య చీఫ్​ గెస్ట్​గా హాజరై ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. సీఎం రిటైర్డ్‌‌ ఓఎస్డీ ఎన్‌‌. రంగారెడ్డి బుక్​ రివ్యూ చేస్తారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ, బీజేపీ కోర్‌‌ కమిటీ సభ్యుడు వివేక్‌‌ వెంకటస్వామి, మాజీ ఎంపీ జితేందర్‌‌రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ, సీఎల్పీ లీడర్​ భట్టి విక్రమార్క, మాజీ నేత జానారెడ్డి, టీజేఎస్‌‌ చీఫ్‌‌ కోదండరామ్‌‌, సుప్రీం కోర్టు అడ్వొకేట్‌‌ నిరూప్‌‌రెడ్డి, రిటైర్డ్‌‌ ఈఎన్సీలు, ఇంజనీర్లు, యూఎస్‌‌ఏ తెలంగాణ డెవలప్‌‌మెంట్‌‌ ఫోరం ప్రతినిధులు, ప్రజాసంఘాల లీడర్లు పాల్గొంటారు.

Latest Updates