ఇవాళ్టి నుంచి ఎంసెట్ ఎగ్జామ్స్

ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి టీఎస్ ఎంసెట్ పరీక్షలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు జరగనున్న ఎంసెట్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 17 వేల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ పరీక్షను నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 83, ఏపీలో 11 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు…

 

Latest Updates