ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ

  •     ఇరిగేషన్ అంశాలు, కొత్త రెవెన్యూ చట్టం, అసెంబ్లీ సమావేశాలపై చర్చ
  •     రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పరిశీలన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినెట్ బుధవారం సమావేశం కానుంది. సాయంత్రం 5 గంటలకు ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితి, కొత్త రెవెన్యూ చట్టం, అసెంబ్లీ సమావేశాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేబినెట్లో చర్చించనున్నట్టు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులో అదనపు టీఎంసీ తీసుకునే పనులు, దుమ్ముగూడెం బ్యారేజీ, సీతారామ ప్రాజెక్టులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పన్ను బకాయిలు, ఇంకా ఎంత సొమ్ము రావాల్సి ఉందన్న అంశంపై ఆర్థిక శాఖ అధికారులు కొద్దిరోజులుగా కసరత్తు చేస్తున్నారు. వారు అందించే అంశాలపై కేబినెట్లో చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం.

Latest Updates