‘వీ6 – వెలుగు’ పిటిషన్ పై కోర్టు విచారణ

సెక్రటేరియట్ కూల్చివేత కవరేజీకి మీడియాను ఎందుకు అనుమతించరు?

ప్రభుత్వమే వీడియోలు, ఫొటోలు విడుదల చేయవచ్చు కదా?

‘వీ6 – వెలుగు’ పిటిషన్ పై కోర్టు విచారణ

ఈనెల 27 వరకు టైమ్ ఇవ్వాలని కోరిన ఏజీ

నిరాకరిం చిన కోర్టు, నేటి కల్లా చెప్పాలని ఆదేశం.

పత్రికలకు ఫ్రీడమ్‌ ఉంది. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. పత్రికలు, టీవీ చానల్స్‌ లేకపోతే ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టమే. కూల్చివేత పనులు ఎలా జరుగుతున్నాయో  ప్రభుత్వమే ఫొటోలు, వీడియోలను విడుదల చేయవచ్చు కదా? వార్‌ జోన్లలోకే అక్రెడిటేషన్ కార్డు లు ఇచ్చి మీడియాను పంపుతున్నారు. కూల్చివేత చర్యలను మీడియాకు బ్రీఫ్‌ చేసేందుకు కనీసం ఒక ఆఫీసర్‌ని పెట్టొచ్చు కదా?

హైదరాబాద్, వెలుగు: ‘యుద్ధా లను కూడా మీడియా కవర్ చేస్తోంది. అటువంటిది సెక్రటే రియట్‌‌‌‌ బిల్డింగ్స్‌‌‌‌ కూల్చివేత పనుల్ని కవరేజీ చేయడానికి మీడియాను ఎందుకు అనుమతించరు?’ అని రాష్ట్ర సర్కార్‌‌‌‌ను హైకోర్టు ప్రశ్నించింది. యుద్ధరంగం ఘటనలనే సీఎన్‌‌‌‌ఎన్, ఐబీఎన్‌‌‌‌ వంటి చానల్స్‌‌‌‌ కవర్ చేస్తున్నాయని, అలాంటప్పుడు సెక్రటేరియట్‌‌‌‌ బిల్డింగ్స్‌‌‌‌ కూల్చి వేత పనుల కవరేజీకి మీడియాకు అనుమతి ఇవ్వకుండా ఆంక్షలు ఎందుకు పెట్టారని నిలదీసింది. సెక్రటేరియట్‌‌‌‌ బిల్డింగ్స్‌‌‌‌ కూల్చివేత పనులను మీడియా కవరేజీ చేయకుండా అడ్డుకుంటోందని, పత్రికా స్వేచ్ఛను కాలరాస్తోందని, మీడియా కవరేజీకి అనుమతిచ్చేలా ఉత్తర్వు లు ఇవ్వా లని కోరుతూ ‘వీ6–వెలుగు’ దాఖలు చేసిన రిట్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ను జడ్జి చల్లా కోదండరామ్‌ బుధవారం విచారించారు.

ప్రమాదాలు జరుగుతాయనే సాకుతో అక్కడ జరిగే పనులు కవరేజీ కాకుండా గుట్టుగా ఎందుకు ఉంచాలని, ప్రభుత్వమే వీడియోలు, ఫొటోలను విడుదల చేయవచ్చు కదా అని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వాన్ని సంప్రదించి చెబుతానని, వారం రోజుల గడువు కావాలని అడ్వొ కేట్‌‌‌‌ జనరల్‌‌‌‌ బీఎస్‌‌‌‌ ప్రసాద్‌‌‌‌ కోరగా అంతసమయం ఇవ్వడానికి హైకోర్టు అంగీకరించ లేదు. కనీసం వచ్చే సోమవారం వరకూ వాయిదా వేయాలని ఏజీ కోరినా సమ్మతించలేదు. ప్రభుత్వ విధానం గురువారం చెప్పాలని ఆదేశించింది. ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘన సెక్రటేరియట్‌‌‌‌ ఆవరణలోకి ప్రింట్, ఎలక్ట్రానిక్‌‌‌‌ మీడియాలను అనుమతించకపోవడం రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛను హరించడమేనని ‘వీ6 టీవీ, వెలుగు’ తరఫు లాయర్ నవీన్‌‌‌‌ వాసిరెడ్డి వాదించారు. సమాచారం సేకరించే హక్కు మీడియాకు, సమాచారాన్ని తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందన్నా రు. సెక్రటేరియట్‌‌‌‌ లోపలికి, పరిసర ప్రాంతాల్లోకి వెళ్లవద్దనే ఆంక్షలు చెల్లవన్నారు. రాజ్యాం గం కల్పించిన హక్కుల్ని రద్దు చేస్తూ చట్టసభ చట్టం చేస్తేనే అలాంటి ఉత్తర్వులిచ్చేందుకు వీలుంటుందని, ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందన్నారు.

మీడియా కవరేజ్‌‌‌‌ కి సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చిందని, బ్రిజ్ భూషణ్ వర్సెస్‌‌‌‌ ఢిల్లీ ప్రభుత్వం మధ్య జరిగిన కేసులో, ఇతర పలు కేసుల్లో సుప్రీంకోర్టు పత్రికాస్వేచ్ఛపై ఇచ్చి న ఉత్తర్వుల్ని రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. హైకోర్టు తక్షణమే స్పందించి సెక్రటేరియట్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌ భవనాల కూల్చి వేత పనుల కవరేజీకి మీడియాను అనుమతించేలా ఉత్తర్వు లు ఇవ్వాలన్నా రు. తమకు ఇష్టం వచ్చిన వృత్తిని నిర్వహించుకునే హక్కు రాజ్యాం గంలోని 19(1)(జి) అధికరణం ప్రతి వ్యక్తి కి కల్పించిందని, దీని ప్రకారం మీడియా ప్రతినిధులు తమ వృత్తిని నిర్వహించకుండా ప్రభుత్వం చట్ట వ్యతిరేక ఆంక్షలు పెట్టి రాజ్యాం గ ధిక్కారానికి పాల్పడుతోందన్నారు. పబ్లిక్‌ రిలేషన్‌‌‌‌ ఆఫీసర్‌ ని పెట్టొ చ్చు కదా కూల్చి వేత పనులను మీడియా, పత్రికలు కవరేజీ చేయకుండా ఆంక్షలు ఎందుకు పెట్టారో వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

మీడియా కవరేజీతోపాటు అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకునే హక్కు కూడా ప్రజలకు ఉందని పిటిషనర్‌‌‌‌ చేస్తున్న వాదనలపై ప్రభుత్వ వైఖరిని తెలియజేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ‘పత్రికలకు ఫ్రీడమ్‌ ఉంది. ప్రజాస్వామ్యం లో పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. పత్రికలు, టీవీ చానల్స్‌‌‌‌ లేకపోతే ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టమే. కూల్చి వేత పనులు ఎలా జరుగుతున్నాయో ప్రభుత్వమే ఫొటోలు, వీడియోలను విడుదల చేయవచ్చు కదా? వార్‌‌‌‌ జోన్లలోకే అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చి మీడియాను పంపుతున్నారు. కూల్చి వేత చర్యలను మీడియాకు బ్రీఫ్‌‌‌‌ చేసేందుకు ఒక పబ్లిక్‌‌‌‌ రిలేషన్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ని పెట్టొచ్చు కదా?’ అని హైకోర్టు ప్రభుత్వా న్ని ప్రశ్నించింది. అనంతరం విచారణను గురువారానికి వాయిదా వేసింది.

ఆంక్షలనే ప్రశ్నించాం

ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ .. సెక్రటేరియట్‌ బిల్డింగుల కూల్చివేతకు హైకోర్టు , సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చాయని, నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ను కొందరు ఆశ్రయించినా ఫలితం లేకపోయిందని చెప్పారు. విచారణను వారం వాయిదా వేస్తే ప్రభుత్వ వైఖరి తెలుసుకుని కోర్టుకు చెబుతానన్నారు. ఈ వాదనలను పిటిషనర్‌ న్యాయవాది నవీన్‌ వ్యతిరేకించారు. తాము బిల్డింగుల కూల్చివేత పనుల్ని ప్రశ్నిం చలేదని, కూల్చివేత పనులు ఎలా జరుగుతున్నాయో పత్రికలు, మీడియా ద్వా రా ప్రజలకు తెలియజేయకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని సవాల్‌ చేశామని వివరించారు.

Latest Updates