యాదాద్రిలో ఇవాళ

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలోశుక్రవారం ఉదయం 4గంటలకుసుప్రభాతం, 4:30 గంటలకు బిందెతీర్థం, ఆరాధన, 5:30 గంటలకు సర్వదర్శనాలు, 5:45 గంటలకు బాలభోగం, 7గంటలకు నిజాభిషేకం, 8గంటలకు సహస్ర నామార్చన, 8:30 గంటలకు శ్రీసుదర్శన నారసింహ హోమం,10:30 గంటలకు నిత్యకల్యాణం, 12:30కి మహా నివేదన,అనంతరం ఉభయ దర్శనాలు, సాయంత్రం 6 గంటలకు అలంకార జోడు సేవోత్సవాలు, రాత్రి 7:20గంటలకు ఆరాధన, 7:30 గంటలకు సహస్ర నామార్చన, 9:30 గంటలకు ఆరగింపు, 9:45 గంటలకు శయనోత్సవం, ద్వార బంధనం.శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాలు ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు నాలుగు దఫాలుగా నిర్వహిస్తారు. అనుబంధంగా ఉన్నశివాలయంలో రామలింగేశ్వరుడిని ఆరాధిస్తూ నిత్య పూజలు కొనసాగుతాయి. 4గంటలకు సుప్రభాతం, 5గంటలకు బిందెతీర్థం, 6 గంటలకు నిజాభిషేకం, 7గంటలకు అర్చన, 9 గంటలకు రుద్రాభిషేకం, 10:30 గంటలకు బిల్ వార్చన, 11 గంటలకు పార్వతీ పరమేశ్వరుల కల్యాణం.

Latest Updates