తెలంగాణ చరిత్రలో ఇవ్వాళ బ్లాక్ డే

న్యాయవ్యవస్థ పై కూడా నమ్మకం పోయింది: ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇవ్వాళ బాధాకరమైన రోజని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సెక్ర‌టేరియేట్ కూల్చేయాల‌ని హైకోర్టు తీర్పు పై సుప్రీంకోర్టు లో విచారణ లోపే సెక్రటేరియట్ కూల్చుతున్నారని అన్నారు. ప్రభుత్వం తప్పులు చేస్తే న్యాయవ్యవస్థ కలుగజేసుకునేది.. కానీ ఇవ్వాళ న్యాయవ్యవస్థ పై కూడా నమ్మకం పోయింది అని అన్నారు. కేసీఆర్ మూఢ నమ్మకానికి 4 కోట్ల ప్రజలను పణంగా పెట్టారన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి నిధులు లేవు కాని రూ.500 కోట్లతో సెక్రటేరియట్ నిర్మాణం అవసరమా? అని ఉత్త‌మ్ ప్ర‌శ్నించారు. ఒక్క కుటుంబ అవసరాల కోసం తెలంగాణ ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారన్నారు.

సీఎస్ సోమేశ్ కుమార్ కేసీఆర్ కి తొత్తుగా మారారని ఉత్త‌మ్ విమ‌ర్శించారు. 20 మందిని తొక్కి సీఎస్ గా పదవి పొందారన్నారు. సోమేశ్ కుమార్ సీఎస్ పదవికి అన‌ర్హుడ‌ని అన్నారు. గవర్నర్ పిలిస్తే పోకుండా సీఎస్ రాజ్యాంగాన్ని అవమానించార‌న్నారు. కేసీఆర్ చీకటి కుట్రలో పాల్గొన్న IAS-IPS అధికారులు ఆత్మపరిశీలన చేసుకోవాల‌న్నారు.

హైదరాబాద్ లో కరోనా విజృంభిస్తున్న సమయంలో సీఎం ఎక్కడికి పోయారని అన్నారు ఉత్త‌మ్. క‌రోనా టెస్ట్‌ల విష‌యంలో ప్రభుత్వం చూపించే లెక్కలకు గ్రౌండ్ లెవల్ లో లెక్కలకు చాలా తేడా ఉందన్నారు. ఏపీ లో 10లక్షల టెస్టులు చేస్తే-తెలంగాణ లో 1లక్ష టెస్టులే చేశార‌న్నారు. పక్క రాష్ట్రంలో సీఎం జగన్ అద్భుతంగా పనిచేస్తూ.. టెస్ట్‌‌లు నిర్వ‌హిస్తోంటే తెలంగాణ లో ఎందుకు టెస్టులు జరగవని ప్ర‌శ్నించారు. కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీ లో చేర్చాలని లేదంటే..కాంగ్రెస్ ఉద్యమం చేస్తుందని చెప్పారు.

Latest Updates