నేడు పలు MMTS రైళ్లు క్యాన్సిల్

కాచిగూడ—ఫలక్ నుమా మధ్య ట్రాక్ మెయింటెనెన్స్ తో పాటు ట్రాఫిక్ రద్దీ కారణంగా ఆదివారం పలు MMTS  రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ట్రైన్ నంబర్ 47212 , 47214 లింగంపల్లి-–ఫలక్ నుమా MMTS సర్వీసు లు కాచిగూడ నుంచి ఫలక్ నుమా వరకు పాక్షికంగా రద్దు చేశారు. లింగంపల్లి నుంచి ఈ రైళ్లు కాచిగూడ వరకు మాత్రమే ప్రయాణం చేయనున్నాయి. ట్రైన్ నంబర్ 47189 ఫలక్ నుమా –లింగంపల్లి MMTS సర్వీస్ ను ఫలక్ నుమా నుంచి కాచిగూడ వరకు పాక్షికంగా క్యాన్సిల్ చేసినట్లు తెలిపారు. ఫలక్ నుమా నుంచి వెళ్లే ప్రయాణికులకు ఈ ట్రైన్ కాచిగూడ నుంచే అందుబాటులో ఉంటుంది. ట్రైన్ నంబర్ 47169 ఫలక్ నుమా- హైదరాబాద్  MMTS సర్వీ స్ కూడా ఫలక్ నుమా కాచిగూడ మధ్య రద్దు చేశారు. ఈ ట్రైన్ కూడా కాచిగూడ  నుంచి హైదరాబాద్ కు ప్రయాణం చేస్తుంది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు తెలిపారు.

Latest Updates