ఇవ్వాళ, రేపు లక్ష పెళ్లిళ్లు

‘మాఘ మాసం ఎప్పుడొస్తుందో.. మౌనరాగాలెన్నినాళ్లో ..’ అని పాడుకుంటూ ముహూర్తం కోసం వేచిచూస్తుంటారు పెళ్లి కుదిరిన యువతీయువకులు.  ఆ ఎదురుచూపులకు చెక్‌ పెడుతూ ఈ నెల 5నే మాఘమాసం మొదలైంది. మార్చి 30వ తేదీ వరకు వివాహాలకు ముహూర్తాలున్నాయి. కానీ ఈ నెలలోనే వేలాది జంటలు ఒక్కటి కానున్నా యి. ఈ మాసం ఒక్క పెళ్లిళ్లకే కాదు.. గృహప్రవేశాలు, శంకుస్థా పనలకు కూడా అనువైనదే. వివాహ షాపింగ్‌ లతో మాల్స్‌ కిటకిటలాడుతున్నాయి. సిటీలో ఈ హడావుడి ఇరవై రోజుల ముందే ప్రారంభమైంది. పెళ్లి అనుబంధ వ్యాపారాలన్నీ ఊపందుకున్నాయి. ఇప్పటికే ఫంక్షన్‌ హాల్స్‌ బుక్కయ్యాయి. శని, ఆదివారాల్లో తెలుగు రాష్ట్రాల్లో సుమారు లక్ష పెళ్లిళ్లు జరగనున్నాయి.

ఈ సీజన్‌ లో మూడు లక్షల వివాహాలు గతేడాది డిసెంబర్ 30తో ముహూర్తాలు ముగిసిపోగా.. 35 రోజుల తర్వాత మళ్లీ వివాహాల సీజన్‌ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది జంటలు ఈ నెలలోనే ముహూర్తాన్ని ఫిక్స్‌ చేసుకున్నా యి. ఈ సీజన్‌ లో సుమారు మూడు లక్షల వివాహాలు జరిగే అవకాశముందని తెలుస్తోంది. ఈ నెల 8, 9, 10, 11, 22, 23 తేదీల్లో అనేక పెళ్లిళ్లు, నెలాఖరు వరకూ మంచి రోజులే ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. మార్చి ఏడో తేదీ నుంచి మొదలయ్యే ఫల్గు ణ మాసంలోనూ పెళ్లిళ్లు చేసుకోవచ్చని, మార్చి 30వ తేదీ వరకూ వివాహాలు జరుగుతూనే ఉంటాయంటున్నారు. ఇదే నెలలో 12న రథసప్తమి, 16న భీష్మ ఏకాదశి పండుగలు కూడా ఉన్నాయి.

Latest Updates