తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు తేలికపాటి వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ(బుధవారం), రేపు(గురువారం) తేలికపాటి వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి అవకాశముందన్నారు. కోస్తాంధ్రలో తీరానికి దగ్గరగా 4.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందన్నారు. దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ, రాత్రి వేళల్లో మాత్రం సాధారణ స్థాయితో పోలిస్తే, 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, మరో రెండు వారాలు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోకి ఇంకా నైరుతీ రుతుపవనాలు ప్రవేశించలేదని, మరో 3 రోజుల్లో రుతుపవనాలు రావచ్చని తెలిపారు. మొదట ఏపీకి, ఆ తర్వాత తెలంగాణలోకి రుతుపవనాలు వస్తాయన్నారు.

Latest Updates