ఈరోజు వెన్నముద్దల బతుకమ్మ

బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. ఆశ్వయుజ మాసం శుద్ధ పాఢ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను వేడుకగా జరుపుకుంటారు.
రంగురంగుల పూల ను త్రికోణాకృతిలో పేర్చి, అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ..ఆడి, పాడతారు. అప్పుడు మహిళలు పాడే పాటలు మనసుకు హత్తుకుంటాయి. ఏరోజు ప్రత్యేకత ఆ రోజుదే.

ఇలా తొమ్మిది రోజులు ఆడిన బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేసి, నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని ఆడపడుచులంతా పంచుకుంటారు. ఎనిమిదో రోజు ఈరోజు బతుకమ్మను ‘వెన్నముద్దల బతుకమ్మ’ అంటారు. గౌరమ్మకు నువ్వులు, బెల్లం కలిపి నైవేద్యంగా పెడతారు.

Latest Updates