ఇయ్యాల వేపకాయల బతుకమ్మ

తెలంగాణ సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ. తొమ్మిది రోజుల పాటు తెలంగాణలో ఎక్కడ చూసినా..బతుకమ్మ సందడే కనిపిస్తుంది. మొదటిరోజు ఎంగిలిపువ్వు బతుకమ్మతో ప్రారంభమయ్యే  సంబురాలు తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. బతుకమ్మ పండుగలో ఏడో రోజును ‘వేపకాయల బతుకమ్మ’గా ఆడపడుచులంతా జరుపుకుంటారు.

ఈ రోజు బతుకమ్మను తంగేడు, గునుగు, చామంతి, గులాబీ పూలతో అందంగా పేర్చి… పాటలు పాడుతూ ఆడి చెరువులో నిమజ్జనం చేస్తారు. వాయనంగా సకినాల పిండిని వేపకాయల్లా చేసి పెడతారు. ఇంకొన్ని ప్రాంతాల్లో పుట్నాల పప్పు, బెల్లం కలిపి నైవేద్యంగా గౌరమ్మకు పెడతారు. బతుకమ్మ ఆట పూర్తయ్యాక ఆ ప్రసాదాన్ని ఆడపడుచులంతా పంచుకుంటారు.

Latest Updates