స్కూల్ బస్ ఢీ : చిన్నారి బాలుడు మృతి

రాచకొండ : స్కూల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ చిన్నారి బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ సంఘటన రాచకొండ కమిషనరేట్ .. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంజపూర్ లో జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడాదిన్నర వయసున్న బాలుడిని కమ్మగూడా లోటస్ లాప్ స్కూల్ బస్ యాక్సిడెంట్ చేసి పోయిందని బాధిత తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు అన్నారు. ఒళ్లంతా గాయాలై బాలుడు చనిపోయాడంటూ గుండెలు బాదుకుంటూ రోదించారు. స్కూల్ ముందు చిన్నారి మృతదేహంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆందోళన చేశారు. పరిస్తితి ఉద్రిక్తంగా మారడంతో… గేట్ కి తాళం వేసి షెట్టర్ వేసుకుని లోపలే స్కూల్ నడిపించింది యాజమాన్యం. పోలీసులు కలగజేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates