టాయిలెట్ పేపర్ల కోసం మహిళల సిగపట్లు..విచారణకు ఆదేశించిన కోర్ట్

టాయిలెట్ పేపర్ కోసం ముగ్గురు మహిళలు సిగ్గ పట్లు పట్టుకొని కొట్టుకున్నారు. ఇంతకీ టాయిలెట్ పేపర్ కోసం ఎందుకు కొట్టుకున్నారని అనుకుంటున్నారా..?

ఆస్ట్రేలియాలో 58మందికి కరోనా సోకింది. అందులో ముగ్గురు బాధితులు మృతి చెందారు. అయితే కరోనా వైరస్ ధాటికి అన్నీ దేశాల్లో ఎగుమతులు, దిగుమతులు ఆగిపోయాయి. వ్యాపారస్తులు వస్తువుల్ని అమ్మే విషయంలో ఆంక్షలు విధిస్తున్నారు.

తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఓ సూపర్ మార్కెట్  యజమాని టాయిలెట్ పేపర్లు అమ్ముతున్నాడు. నిత్యవసర  వస్తువుల ఉత్పత్తి తగ్గిపోతున్నాయని ప్రచారం రావడంతో భయాందోళనకు గురైన ప్రజలు ముందుగా తమకు కావాల్సిన వస్తువులన్నీ ఓ సంవత్సరానికి సరపడా కొనుగులు చేసుకుంటున్నారు. అలా  ఓ మహిళ పెద్ద మొత్తంలో టాయిలెట్ పేపర్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించింది. అయితే సదరు మార్కెట్ యజమానికి ఒక్కొక్కరికి ఒక్కో టాయిలెట్ పేపర్లను అమ్ముతున్నట్లు బోర్డ్ పెట్టాడు. అంతలోనే మరో మహిళ టాయిలెట్ పేపర్లను కొనుగోలు చేసేందుకు మార్కెట్ కు వచ్చింది. తొలత కొనుగోలు చేసిన మహిళ వద్ద పెద్ద మొత్తంలో టాయిలెట్ పేపర్లు ఉండడంతో తనకు కావాలంటూ తీసుకుంది. అక్కడ మొదలైన చిన్న గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. నాదంటే నాదంటూ ఇద్దరు మహిళలు సిగపట్లు పట్టుకొని కొట్టుకున్నారు. కొద్ది సేపటికి గొడవ సర్ధుమణగడంతో మార్కెట్ యజమానికి ఇద్దరు మహిళలకు చెరో టాయిలెట్ పేపర్ ఇచ్చి పంపించారు. అయితే ఈ గొడవపై కేసు నమోదైంది. కేసు పై విచారణ చేపట్టిన కోర్ట్ ..మహిళలు ఏప్రిల్ 28న కోర్ట్ కు హాజరు కావాలంటూ ఆదేశించింది.

 

Latest Updates