‘టోకెన్ దో.. చావల్ లేలో’… కోడ్ ఉల్లంఘించి కెమెరాకు దొరికిపోయిన  టీఆర్ఎస్ అభ్యర్థి

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఇంటింటికీ తిరిగి బియ్యం బస్తాలు పంచుతున్న అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ మహిళా అభ్యర్థిని కెమెరా కంటికి దొరికిపోయింది. ముందు జాగ్రత్తగా ఓటర్లకు టోకెన్లు పంచిపెట్టి తర్వాత బియ్యం బస్తాలు ఆటోలో వేసుకుని.. టోకెన్ దేదో.. చావల్ లేలో.. అంటూ బియ్యం బస్తాలు పంచుతూ  వెళుతోంది. స్థానికులు కొందరు ఎవరు.. మీరు.. ఏ పార్టీ అని ప్రశ్నిస్తే.. టీఆర్ఎస్ అని చెప్పింది.

మౌలాలి డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్ధి ఫాతిమా అమీనుద్దీన్ కెమెరా కు దొరికిపోయిన వైనం కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయడం కలకలం రేపుతోంది. కోడ్ ఉల్లంఘించి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ రాజకీయ పార్టీల వారు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్న నేపధ్యంలో బయటపడిన ఈ ఉదంతం హాట్ టాపిక్ అయింది. ఎన్నికల అధికారులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

for more News…

వీ6 స్పెషల్ ఇంటర్వ్యూ: వరదలొచ్చినప్పుడు కేసీఆర్, ఒవైసీ ఎక్కడున్నారు?

ఓటింగ్ పెంపునకు జీహెచ్ఎంసీ వినూత్న చర్యలు

మన సంస్కృతి ఎమోషనల్‌‌ రీచార్జ్‌‌లా పని చేస్తుంది

Latest Updates