టోక్యో ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ కు కరోనా

న్యూఢిల్లీ: టోక్యో 2020 ఒలింపిక్ ఆర్గనైజింగ్ కమిటీలోని ఓ మెంబర్ కు కరోనా సోకింది. ఆర్గనైజింగ్ కమిటీ హెడ్ క్వార్టర్స్ లో పని చేస్తున్న ఈ మెంబర్ కు కరోనా పాజిటివ్ అని మంగళవారం స్పష్టమైంది. ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్న అతడితో ఎవరెవరు కాంటాక్ట్ లో ఉన్నారననేది ఐడెంటిఫై చేసి వారిని హోమ్ ఐసోలేషన్ లో ఉంచడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. సదరు అధికారి పని చేసిన ఫ్లోర్ ను డిసిన్​ఫెక్ట్​ చేసి మూసి వేయనున్నామని టోక్యో నిర్వాహక కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది. జపాన్ ప్రభుత్వం ఈమధ్యే స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ విధించడంతో.. టోక్యో ఒలింపిక్స్ కోసం పని చేస్తున్న దాదాపు 3,800 మంది స్టాఫ్​వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కరోనా కారణంగా ఈ ఏడాది జూలైలో ఆరంభం కావాల్సిన టోక్యో ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Latest Updates