ఒలంపిక్స్ వద్దంటున్న టోక్యో ప్రజలు

టోక్యో: ఒలింపిక్స్ నిర్వహణ టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ.. టోక్యో ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతున్నది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వచ్చే ఏడాది కూడా తమ దగ్గర ఒలింపిక్స్ ను నిర్వహించొద్దని సగానికి పైగా టోక్యో ప్రజలు కోరుకుంటున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. మెగా ఈవెంట్ ను పూర్తిగా రద్దు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. జపాన్ కు చెందిన కైడో న్యూస్ , టోక్యో ఎంఎక్స్ టెలివిజన్ అనే న్యూస్ ఆర్గనైజేషన్లు సింగిల్ డేటా పాయింట్ తో ఈ సర్వేను నిర్వహించాయి. ఈనెల 26 నుంచి 28 వరకు టెలిఫోన్ ద్వారా జరిపిన సర్వేలో మొత్తం 1030 మంది స్పందించారు. ఇందులో 51.7 శాతం మంది ప్రజలు గేమ్స్ పోస్ట్​పోన్ లేదా క్యాన్సిల్ అవుతాయని భావిస్తుండగా, 46.3 శాతం మంది మాత్రం రీ షెడ్యూల్ పై ఆశలు పెట్టుకున్నారు. గేమ్స్ ను వ్యతిరేకిస్తున్న వారిలో (51.7) కూడా 27.7 శాతం మంది పూర్తిగా రద్దు చేయాలని కోరుతున్నారు. 24.0 శాతం మంది మాత్రం సెకండ్ టైమ్ పోస్ట్​పోన్ మెంట్ కావాలని చెబుతున్నారు. ఇప్పుడున్న క్రైసిస్ లో  గేమ్స్ నిర్వహణ అంత సే ఫ్ కాదని హెల్త్ ఎక్స్ప ర్స్ట్ కూడా హెచ్చరిస్తున్నారు . ప్రేక్షకులు లేకుండా కోరుకునేవారి శాతం 31.1 గా ఉండగా, 15.2 శాతం మంది పూర్తిస్థాయి ఒలింపిక్స్ ను కోరుకుంటున్నారు.

Latest Updates