చైనాలో డ్రోన్లతో టోల్ ట్యాక్స్ వసూళ్లు

కరోనా వైరస్ తో చైనా ప్రజలు భయంతో బతుకుతున్నారు. ఎప్పుడు ఎవరిని బలితీసుకుంటుందో తెలియక  భయాందోళన చెందుతున్నారు. ఒకరితో..ఒకరు మాట్లాడుకోడానికి కూడా వెనుకాడుతున్నారు. సామాన్య ప్రజలతో పాటు అధికారులు కూడా..ఇతరులకు దగ్గరగా నిలబడేందుకు జంకుతున్నారు. ఇందులో భాగంగానే చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ లోని షెంజెన్ నగరంలోని ఎక్స్ ప్రెస్ హైవేపై టోల్ ట్యాక్స్ ను కూడా డ్రోన్లతో వసూలు చేస్తున్నారు. టోల్ బూత్ సిబ్బంది వాహనాదారులకు దూరంగానే నిలబడి.. క్యూ ఆర్ కోడ్ ను ప్రింట్ చేసిన బోర్డులను డ్రోన్లతో కార్ల దగ్గరకు పంపి… వాటిని స్కాన్ చేసి డబ్బులు కట్టాలంటూ ఆ బోర్డులపై రాసి పెట్టారు. వేర్వేరు ప్రాంతాల నుంచి వస్తున్న వారికి కాస్త దూరంగా ఉండేందుకు  ఈ పద్ధతిని పాటిస్తున్నామని అధికారులు తెలుపుతున్నారు. కరోనా వైరస్ కు భయపడే ఈ విధంగా డ్రోన్లను యూజ్ చేస్తున్నామని చెబుతున్నారు.

Latest Updates