ప్రపంచంలోనే పొడవైన చెట్టు..

మబ్బుల్ని తాకుతూ అబ్బురపరుస్తున్న ఈ చెట్టు ప్రపంచంలోనే అతి ఎత్తైనది! ఓ ఫుట్ బాల్ మైదానం పొడవు అంటే దాదాపుగా 100.3మీటర్ల (329 అడుగులు) పొడవు ఉంటుంది.ఈ చెట్టుకు కమ్మనైన సువాసననిచ్చే పువ్వులు కూడా పూస్తాయి. మలేసియాలోనిబోర్నియో ద్వీప రెయిన్ ఫారెస్ట్ లోఅమెరికా, మలేసియా సైంటిస్టులు ఇటీవల దీన్ని గుర్తించారు. దీని ఎత్తును ప్రేరణగా తీసుకుని ‘మెనారా’ అని పేరు పెట్టారు.అంటే మలాయ్ భాషలో ‘టవర్’ అని అర్థం. మెనారా ‘ఎల్లోమెరంటీ’ అనే మొక్కల జాతికి చెందిన చెట్టు . పోయిన జనవరిలో ఓ ట్రీ క్లయింబర్ దీన్ని ఎక్కి, ఎత్తు ను టేపుతో కొలిచారు. ‘‘చెట్టు పైకి ఎక్కిన తర్వాత నేను చాలా థ్రిల్ అయ్యాను. అక్కడి నుంచి అడవి ఓ స్వర్గంలా కనిపించింది’’ అనిఅతడు ఫీలిం గ్స్ ను షేర్ చేశాడు. ఇప్పటివరకూ టాస్మానియాలో ఉన్న యూకలిప్టస్ చెట్టు (99.6 మీటర్లు) ప్రపంచంలోనే అతి ఎత్తైన చెట్టు గా గుర్తింపు పొందింది. వేర్లతో సంబంధం లేకుండా మెనారా బరువు 81,500 కిలోలు ఉందట!

Latest Updates