కరోనాతో నటుడు కోసూరి వేణుగోపాల్ మృతి

కరోనా మహమ్మారికి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే ఎందోరో సినీ నటులను బలితీసుకుంది. లేటెస్ట్ గా టాలీవుడ్ నటుడు కోసూరి వేణుగోపాల్ కరోనాతో చనిపోయారు. కరోనా పాజిటివ్ రావడంతో గత 20 రోజులుగా గచ్చిబౌలిలోని ఓ  ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయనకు భార్య,కుమారుడు, కూతురు ఉన్నారు. మర్యాద రామన్న, పిల్ల జమీందార్, ఛలో, విక్రమార్కుడు, అమీతుమీ వంటి పలు సినిమాల్లో నటించి నవ్వించారు.

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన వేణుగోపాల్ ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ గా పని చేసి రిటైర్ అయ్యారు. ఉద్యోగం చేస్తూనే సినిమాల్లో నటించేవాడు. వేణుగోపాల్ మృతి పట్ల పలువురు సినీ నటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Latest Updates