టాలీవుడ్ నటి సురేఖా వాణి భర్త మృతి

టాలీవుడ్ క్యారక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి భర్త సురేష్ తేజ అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. భర్త మరణంతో సురేఖ వాణి శోకసంద్రంలో మునిగిపోయారు. సురేష్ తేజ టీవీ కార్యక్రమాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘మా’ టాకీస్, మొగుడ్స్ పెళ్లామ్స్, హార్ట్ బీట్ వంటి టీవీ కార్యక్రమాలకు డైరెక్టర్ గా చేశారు. అప్పట్లో సురేఖ టీవీ యాంకర్ గా పనిచేశారు. అప్పటికే అదే రంగంలో ఉన్న సురేష్ తేజ ఆమె ప్రేమించి.. పెళ్లి చేసుకున్నారు. వీరికి సుప్రిత అనే కుమార్తె ఉంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Latest Updates