ఘనంగా వెంకటేష్ కూతురి పెళ్లి

జైపూర్: విక్టరీ వెంకటేశ్‌ కుమార్తె ఆశ్రిత వివాహం ఆదివారం తెల్లవారుజామున ఘనంగా జరిగింది. రాజస్థాన్‌ రాజధాని జైపూర్ లోని ఓ హోటల్‌ లో ఆశ్రిత, హైదరాబాద్‌ రేస్‌ క్లబ్‌ ఛైర్మన్‌ సురేందర్‌ రెడ్డి మనవడు వినాయక్‌ రెడ్డిని వివాహం చేసుకున్నారు. వేడుకకు రామ్‌చరణ్‌, ఉపాసన, నాగచైతన్య, సమంత, సల్మాన్‌ ఖాన్‌ తదితర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. శుక్రవారం రాత్రి జైపూర్ లో ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో సమంత, నాగచైతన్య, రానా తదితరులు డాన్స్ లతో సందడి చేశారు.

Latest Updates