సినీ ర‌చ‌యిత సుద్దాల అశోక్‌ తేజకు శస్త్రచికిత్స

ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ అనారోగ్యానికి గురయ్యారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అశోక్ తేజకు చికిత్స అందిస్తున్న వైద్యులు మాట్లాడుతూ.. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, శ‌నివారం (23-05-2020)లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయ‌నున్న‌ట్టు తెలిపారు. అయితే ఈ ఆపరేషన్లో భాగంగా అవసరమైన రక్తదానం చేసేందుకు చిరంజీవి బ్లడ్ బ్యాంకుకు చెందిన 15 మంది రక్తదాతలు ఆ ఆసుపత్రిలో రక్తదానం చేసిన‌ట్టు స‌మాచారం.

Latest Updates