టామ్ అండ్ జెర్రీ @80

ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవంటారు. ఎందుకంటే కత్తుల మధ్య దూసుకోవడం తప్పించి..  స్నేహానికి తావు ఉండదు కాబట్టి.  అట్లాగే పిల్లి–ఎలుక..  ఒకదానికొకటి అస్సలు పడదంటారు.  పిల్లి తరుముతుంటే..  ఎలుక ప్రాణ భయంతో పరుగులు తీస్తుంది. వెరసి బద్ధశత్రువులనే ముద్రను వేసుకున్నాయి ఈ రెండూ. కానీ, ఈ బద్ధశత్రువులనే ఒకచోటికి తెచ్చి ఏండ్ల తరబడి ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌మెంట్ అందిస్తున్నారు. ‘టామ్‌‌‌‌ అండ్‌‌‌‌ జెర్రీ’..  పిల్లల నుంచి ముసలివాళ్ల దాకా  అందరినీ అలరించే కార్టూన్‌‌‌‌ క్యారెక్టర్లు.  ఈ కార్టూన్‌‌‌‌ సిరీస్‌‌‌‌ చూస్తూ పెరిగినోళ్లు.. ఇప్పటికీ ఇంకా చూస్తూ ఉన్నోళ్లు చాలామందే ఉంటారు. అంతగా ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌ చేస్తున్న ఈ పిల్లి ఎలుకల అల్లరి వెనుక ఎన్నో ఆసక్తికరమైన సంగతులున్నాయి.

విలియమ్‌‌‌‌ హన్నా.. జోసెఫ్‌‌‌‌ బార్బెర.. అమెరికన్‌‌‌‌ యానిమేటర్లు. అంతకుమించి ‘టామ్‌‌‌‌ అండ్‌‌‌‌ జెర్రీ’ సృష్టికర్తలు.  1940, ఫిబ్రవరి 10న తొమ్మిది నిమిషాల నిడివితో ఫస్ట్ ఎపిసోడ్‌‌‌‌ రిలీజ్‌‌‌‌ అయ్యింది. ‘పస్స్‌‌‌‌ గెట్స్‌‌‌‌ ది బూట్‌‌‌‌’ పేరుతో మెట్రో గోల్డ్‌‌‌‌వైన్‌‌‌‌ మేయర్‌‌‌‌(ఎంజీఎం) కార్టూన్‌‌‌‌ కంపెనీ ఈ ఎపిసోడ్‌‌‌‌ని నిర్మించింది.  బ్లాక్‌‌‌‌ అండ్‌‌‌‌ వైట్ కలర్‌‌‌‌లో రిలీజ్‌‌‌‌ అయిన ఈ షోకి మంచి రెస్పాన్స్‌‌‌‌ దక్కింది. ఈ షో టెలికాస్ట్‌‌‌‌ కంటే ఏడాది ముందే పెన్సిల్ స్టోరీ బోర్డుగా ఏడాది క్రితమే రూపుదాల్చింది. మొదట్లో వీటికి పేర్లుండేవి కావు.  1941లో వచ్చిన షార్ట్ ఫిల్మ్‌‌‌‌ ‘ది మిడ్‌‌‌‌నైట్‌‌‌‌ స్నాక్‌‌‌‌’లో  పిల్లికి జాస్పర్, ఎలుకకి జింక్స్ అని పేరు పెట్టారు. కానీ, పేర్లు క్యాచీగా ఉండాలనే ఉద్దేశంతో హన్నా, బార్బెరలు బుర్రలు బద్ధలు కొట్టుకుంటారట. ఆ టైంలో జాన్‌‌‌‌ కార్ అనే యానిమేటర్‌‌‌‌ ‘టామ్‌‌‌‌’, ‘జెర్రీ’ అనే పేర్లు సూచించాడట. ఆ పేర్లు బాగా నచ్చడంతో కార్‌‌‌‌కి యాభై డాలర్ల నజరానా ఇచ్చారు హన్నా, బార్బెరలు. అలా టామ్‌‌‌‌ అండ్ జెర్రీ షో మొదలైంది.

బోలెడంత వినోదం…

పిల్లి, ఎలుక(కార్టూన్లు).. రెండు కాళ్ల మీద నడవటమే ఈ సిరీస్‌‌‌‌కు మెయిన్ అట్రాక్షన్‌‌‌‌. నిజానికి మొదట్లో అవి నాలుగు కాళ్ల మీదే నడిచేవి. కానీ, కొన్ని ఎపిసోడ్స్‌‌‌‌ తర్వాత హ్యూమర్‌‌‌‌ కోసం రెండు కాళ్ల మీద నడిచినట్లు చూపించారు. అది అలాగే కంటిన్యూ అవుతోంది.  చిన్న పిల్లల కార్టూన్స్‌‌‌‌లో వయొలెన్స్‌‌‌‌ ఎక్కువగా ఉంటే టెలికాస్టింగ్‌‌‌‌కి అనుమతించరు. టామ్ అండ్‌‌‌‌ జెర్రీ షో అందుకు పూర్తి మినహాయింపు. ఇందులో హింసపాలు ఎక్కువే ఉన్నా.. అలరించేదిగా ఉంటుంది. ‘పిల్లికి చెలగాటం.. ఎలుకకి ప్రాణ సంకటం’.. ఈ షో అందుకు విరుద్ధం. జెర్రీని చంపేందుకు టామ్ రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. కత్తులు, గొడ్డలి వాడుతుంది. బాంబులు విసురుతుంది. విషం పెట్టి చంపాలని చూస్తుంది. కానీ, ఆ చిట్టి ఎలుక ముందు ఆ పప్పులేవీ ఉడకవు. పైగా టామ్‌‌‌‌నే బోల్తాకొట్టిస్తుంది. ఈ ప్రయత్నాలతోనే అసలు కామెడీ పుడుతుంది. చివర్లో జెర్రీ రిలాక్స్‌‌‌‌గా కూర్చుంటే..  టామ్‌‌‌‌ అరుపులతో ఎపిసోడ్‌‌‌‌కి శుభం కార్డు పడుతుంది. ఆ అరుపుతో టామ్‌‌‌‌ మళ్లీ తన ప్రయత్నాలు కొనసాగుతాయనే సంకేతం ఇస్తుంది. ఇలా పిల్లి–ఎలుకల మధ్య ఎత్తులు, పైఎత్తులు, చిత్తులతో బోలెడంత వినోదం అందిస్తాయి టామ్‌‌‌‌ అండ్ జెర్రీలు

సూసైడ్ చేసుకుంటయా?

ఎనభై ఏళ్ల క్రితం మొదలైన టామ్ అండ్ జెర్రీ కార్టూన్‌‌‌‌ షో.. సెప్టెంబర్ 27, 2005 వరకు కొనసాగింది. మొత్తం 163 ఎపిసోడ్స్‌‌‌‌ టెలికాస్ట్ అయ్యాయి.  పిల్లి, ఎలుకల రూపాల్లో చిన్నచిన్న మార్పులతో  చాలా వెర్షన్‌‌‌‌లు వచ్చాయి. వెర్షన్‌‌‌‌కొక డైరెక్టర్ పని చేశారు. అయితే చివరి ఎపిసోడ్‌‌‌‌ ఏంటన్నదానిపై ఒకరకమైన గందరగోళం నెలకొంది. టామ్‌‌‌‌ అండ్‌‌‌‌ జెర్రీలు సూసైడ్‌‌‌‌ చేసుకోవడంతో కథ ముగుస్తుందని ఒక ఎపిసోడ్‌‌‌‌ వైరల్ అవుతుంటుంది. కానీ, అది ఫైనల్ ఎపిసోడ్‌‌‌‌ కాదు. 1956, నవంబర్‌‌‌‌ 16న ‘బ్లూ క్యాట్ బ్లూస్‌‌‌‌’ అనే ఎపిసోడ్‌‌‌‌ టెలికాస్ట్‌‌‌‌ అయ్యింది. ఆ స్టోరీలో ప్రేయసిలు మోసం చేయడంతో టామ్‌‌‌‌, జెర్రీ ఇద్దరూ.. డిప్రెషన్‌‌‌‌లోకి వెళ్లిపోతారు. ఆ బాధలో ఇద్దరూ రైల్వే ట్రాక్‌‌‌‌ మీదకి వెళ్లి సూసైడ్‌‌‌‌ చేసుకుంటారు. అలా ఆ ఎపిసోడ్‌‌‌‌ ముగుస్తుందంతే. కానీ, ఆ ఇద్దరికీ మరణం లేదుకదా!. అందుకు తర్వాత మరికొన్ని ఏండ్లు అలా అలరిస్తూనే ఉంటారు. అన్నట్లు షో ప్రారంభమైన తేదీ ప్రకారం చూసుకుంటే.. ఈ పిల్లిఎలుకల వయసు ఎనభై ఏళ్లన్నమాట.

అపూర్వ స్నేహం

ఎలుక కనిపిస్తే.. పిల్లి వెంటపడతది. దొరకబట్టుకుని ఆడుకుంటది. ఆడి ఆడి అమాంతం మింగేస్తది. కానీ, జెర్రీ చేతికి దొరికినా టామ్‌‌‌‌ అంతపని చెయ్యదు. టామ్‌‌‌‌ ఓ ఇంటి పిల్లి. మామ్మీ టూ షూస్‌‌‌‌ ఆ ఇంటికి ఓనర్‌‌‌‌.  ఆమె టామ్‌‌‌‌ని‘థామస్‌‌‌‌’  అని ముద్దుగా పిలుచుకుంటది. చివరికి ఆమె చెప్పినా కూడా.. జెర్రీకి హాని చెయ్యదు టామ్‌‌‌‌. ఎందుకంటే జెర్రీ లేకపోతే టామ్‌‌‌‌కి ఏం తోచదు కాబట్టి. అలాగే టామ్‌‌‌‌ని ఇబ్బంది పెట్టకపోతే జెర్రీకి నిద్రపట్టదు. అలాగే ఒకరి ప్రేమకథలో మరొకరు వేలుపెట్టి చెడగొడుతుంటారు.  అదేటైంలో అంతర్లీనంగా ఈ కార్టూన్‌‌‌‌లో ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. వాటికి మంచి–చెడులకు తేడా తెలుసు. అందుకు ఆపదలో ఉన్నవాళ్లను ఆదుకుంటాయి.  ఒక ఎపిసోడ్‌‌‌‌లో బేబీసిట్టర్‌‌‌‌(ఆయా) బిడ్డను నిర్లక్ష్యంగా వదిలేస్తుంది. ఆ టైంలో ఆ చిన్నారిని కాపాడేది టామ్‌‌‌‌ అండ్‌‌‌‌ జెర్రీలే. మరో సినిమాలో తప్పిపోయిన తండ్రీకూతుళ్లను కలిపి సాయం చేస్తాయివి. పిల్లిఎలుకల్లా కొట్లాడుకున్నా ఆ రెండింటి మధ్య మంచి స్నేహం ఉంది. ఒకరిని విడిచి మరొకరు క్షణం కూడా ఉండలేరు వాళ్లు. టామ్‌‌‌‌ ఆపదలో ఉంటే జెర్రీ సాయం చేస్తుంది. తమకు అడ్డుగా వచ్చేవాళ్లను జాయింట్‌‌‌‌గా ఆడేసుకుంటారు ఈ ఇద్దరు. ఆ పనయ్యాక మళ్లీ వారి పోరు యథాతథంగా కొనసాగుతది. ఇలా  ఎన్నేండ్లు అయినా వాళ్ల గోల ఆగదు. వాళ్ల అపూర్వ స్నేహానికి పుల్‌‌‌‌స్టాప్‌‌‌‌ పడదు. ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌మెంట్ ప్రపంచంలో ఒక  ఐకానిక్‌‌‌‌ షోగా ఆ పిల్లిఎలుకల స్థానం  ఎప్పటికీ పదిలంగానే

 

Latest Updates