రియల్​ లైఫ్‌‌లో కూడా టామ్​ మంచి పైలెట్​

హాలీవుడ్​ నటుడైన టామ్ ​క్రూజ్‌‌కి ఇండియాలో మంచి ఫాలోయింగే​ ఉంది. టామ్​ క్రూజ్ నటుడే కాదు నిర్మాత కూడా. మిషన్ ఇంపాజిబుల్-, మైనారిటీ రిపోర్ట్-, ది లాస్ట్ సమురాయ్,- వార్ ఆఫ్ ది వరల్డ్ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా టామ్‌‌కి మంచి పేరు సంపాదించి పెట్టాయి. ముఖ్యంగా 1996లో మొదలైన ‘మిషన్​ ఇంపాజిబుల్’ సినిమా హవా 2018లో రిలీజైన ‘మిషన్​ ఇంపాజిబుల్​ ఫాలవుట్​’ వరకూ కొనసాగింది. కంప్యూటర్​ విజువల్​ ఎఫెక్ట్స్​కి ప్రాధాన్యత తక్కువ ఇచ్చి, యాక్షన్‌‌కి ఎక్కువ ఇంపార్టెన్స్​ ఇచ్చారు ఈ సినిమాలో. ఆ సినిమా టామ్​ క్రూజ్​ చిత్రాల కలెక్షలన్నింటినీ బ్రేక్​ చేసింది. ఇప్పుడు లేటెస్ట్​గా టామ్​ ‘టాప్​ గన్​ 2’ సినిమా మొదలుపెట్టాడు. ఈ సినిమా1986లో వచ్చిన ‘టాప్​ గన్​’ సినిమాకి సీక్వెల్. టామ్​​ హీరోగా టోనీ స్కాట్​ డైరెక్షన్​లో తెరకెక్కింది. కంప్లీట్ యాక్షన్​ డ్రామా అయిన ఈ సినిమాలో టామ్​ ఋనేవెల్​ ఫ్లైట్​ ఆఫీసర్​ మావెరిక్‌‌గా యాక్షన్‌‌ అదరగొట్టేశాడు. దాదాపు ఇరవై ఐదేళ్ల తర్వాత ఈ సీక్వెల్‌‌ని తెరకెక్కిస్తున్నాడు. దీనికి  ప్రొడ్యూసర్​ కూడా టామే. ఇందులో టామ్​ ఫ్లైట్​ ట్రైనర్‌‌‌‌గా కనిపించనున్నాడు. రియల్​ లైఫ్‌‌లో కూడా టామ్​ మంచి పైలెట్​. తన ఫ్లైట్‌‌ని తనే నడుపుకుంటాడు కూడా. అందుకని ఆ రోల్‌‌ని​ ఎంచుకుని ఉండొచ్చు. గ్లెన్ పావెల్‌‌తోపాటు మైల్స్ టెల్లర్,- జెన్నీఫర్ కాన్నేల్లీ, జాన్ హమ్‌‌లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. జోసెఫ్ కొసిన్‌‌స్కీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా జూన్‌‌లో విడుదల కానుంది.

Latest Updates