గణేష్ నిమజ్జనం సందర్భంగా రేపు సెలవు

వినాయక నిమజ్జనం సందర్భంగా రేపు(గురువారం) హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. వీటితో పాటు మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలకు కూడా ఈ సెలవు వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేపు సెలవు దినం బదులుగా ఈనెల 14న రెండో శనివారాన్ని పనిదినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు వినాయక నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ స్పష్టం చేశారు. 21 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దింపామని చెప్పారు. ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, రైల్వే పోలీసు ఫోర్స్‌తో నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు 17 వేల విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని తెలిపారు కమిషనర్.

Latest Updates