రేపు మద్యం దుకాణాలు బంద్

ఈ నెల 23వ తేదీన పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా సైబరాబాద్​కమిషనరేట్ పరిధిలోని మద్యం దుకాణాలు, బార్ అండ్​రెస్టారెంట్లు మూసి వేస్తున్నట్లు సైబరాబాద్​ కమిషనర్​ వీసీ సజ్జనార్ ఉత్తర్వులు జారీచేశారు. 23న ఉదయం 6 గంటల నుంచి 24వ తేదీ ఉదయం 6 గంటలకు షాపులు తెరవకూడదన్నారు. కమిషనరేట్ పరిధిలోని వైన్ షాపులు, బార్​అండ్​రెస్టారెంట్లు, మిలటరీ క్యాంటీన్లు, స్టార్ హోటల్స్, రెస్టారెంట్స్,  హోటల్స్, లిక్కర్​ దుకాణాలు, క్లబ్​లకు ఇది వర్తిస్తుందని తెలిపారు. నిబంధనలను ఉల్లంగిస్తే  కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు.

Latest Updates