రాష్ట్రంలో రేపు తేలికపాటి వర్షాలు

రాష్ట్రంలో రేపు(గురువారం) కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అఫ్గానిస్థాన్‌ వైపు నుంచి వస్తున్న గాలులు, ఆగ్నేయ దిశ నుంచి వస్తున్న గాలులు ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ ప్రాంతాల దగ్గర కలవనున్నాయి. వీటి కారణంగా క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడి తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Latest Updates