భారత్‌పై ప్రతీకారం తీర్చుకునేంత శక్తి లేదు

భారతదేశంపై ప్రతీకారం తీర్చుకునేంత శక్తి మలేషియాకు లేదన్నారు మలేషియా ప్రధాని మహతిర్ మొహమ్మద్. మలేషియా పశ్చిమ కోస్తా ప్రాంతంలోని లాంగ్‌కావి దీపంలో సోమవారం మీడియాతో ఆయన మాట్లాడారు. కశ్మీరుపై భారత ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ మలేషియా ప్రధాని చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా ఆ దేశం నుంచి పామాయిల్ దిగుమతులను భారత్ ఈ నెలలో నిలిపివేసింది. భారత్‌పై ప్రతీకారం తీర్చుకునేంత పెద్దవాళ్లం కాదని, ఈ సమస్యను ఎదుర్కోవడానికి మార్గాలను వెతుక్కోవలసి ఉంటుందన్నారు మహతిర్. మలేషియా నుంచి అత్యధికంగా పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నదేశం.. భారత్ మాత్రమే.

Latest Updates