ఈ 10 రాష్ట్రాల్లోనే క‌రోనా విల‌యం తాండ‌వం..తెలుగురాష్ట్రాలు ఏఏ స్థానాల్లో ఉన్నాయంటే

శుక్ర‌వారం ఉదయానికి దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 45ల‌క్ష‌లు దాటాయి. అయితే దేశంలో ఎక్కువ కేసులు 10 రాష్ట్రాల్లో న‌మోదైన‌ట్లు కేంద్రం తెలిపింది. ప‌ది రాష్ట్రాల్లో ఎన్ని కేసులు న‌మోద‌య్యాయి. ఎంత‌మంది మ‌ర‌ణించార‌నే అంశంపై గ‌ణాంకాలు వెలుగులోకి వ‌చ్చాయి.

క‌రోనా ఎక్కువ వ్యాప్తి చెందిన 10 రాష్ట్రాల్లో మ‌హ‌రాష్ట్ర 10ల‌క్ష‌ల క‌రోనా కేసులతో ప్ర‌థ‌మ‌స్థానంలో ఉండ‌గా..అదే రాష్ట్రంలో క‌రోనా సోకి 28,648మంది మ‌ర‌ణించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 5,37,637మందికి క‌రోనా సోక‌గా..4702మంది క‌రోనాతో మ‌ర‌ణించారు

త‌మిళ‌నాడు లో 486, 052 మందికి క‌రోనా సోక‌గా..8,154 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు

క‌ర్నాట‌క‌లో 430, 947మందికి క‌రోనా సోక‌గా ..6956 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు.

ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లో 292, 029 మందికి క‌రోనా సోక‌గా..4206 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు

ఢిల్లీలో 205 ,482 మందికి క‌రోనా సోక‌గా..4666మంది క‌రోనాతో మ‌ర‌ణించారు

వెస్ట్ బెంగాల్ లో 193, 175 మందికి క‌రోనా సోక‌గా 3,771మంది క‌రోనాతో మ‌ర‌ణించారు

బీహార్ లో 153, 785మందికి క‌రోనా సోక‌గా 785మంది క‌రోనా తో మ‌ర‌ణించారు

తెలంగాణ‌లో 152, 602 మందికి క‌రోనా సోక‌గా 940మంది క‌రోనాతో మ‌ర‌ణించారు

ఒడిస్సాలో 139, 121 మందికి క‌రోనా సోక‌గా 642మంది క‌రోనాతో మ‌ర‌ణించారు.

క‌రోనా కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్న 10 రాష్ట్రాల్లో మ‌హ‌రాష్ట్ర ప్ర‌థ‌మ‌స్థానంలో ఉంది. తెలుగురాష్ట్రాల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రెండో స్థానంలో, తెలంగాణ 9వ స్థానంలో ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ విడుద‌ల చేసిన నివేదిక‌లో పేర్కొంది.

Latest Updates