టోరెంట్ ఫార్మా హైపర్‌‌‌‌టెన్షన్ డ్రగ్ వెనక్కి

న్యూఢిల్లీ: టోరెంట్ ఫార్మా ఇంక్‌‌ అమెరికా, ప్యూర్టో రికోల నుంచి 73,896 బాటిళ్ల హైపర్‌‌‌‌టెన్షన్ ట్రీట్‌‌మెంట్ టాబ్లెట్లను రీకాల్ చేస్తోంది. యూఎస్‌‌పీ 50 ఎంజీ లోసార్టన్ పోటాషియం టాబ్లెట్లకు చెందిన 8,688 బాటిళ్లను టోరెంట్ అమెరికా, ప్యూర్టో రికోల నుంచి రీకాల్ చేస్తున్నట్టు యూఎస్‌‌ఎఫ్‌‌డీఏకు చెందిన ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ రిపోర్ట్ తెలిపింది.

అంతేకాక ఇదే టాబ్లెట్లకు చెందిన యూఎస్‌‌పీ 100 ఎంజీవి 39,432 బాటిళ్లను వెనక్కి తీసుకుంటుందని పేర్కొంది. రిపోర్ట్ ప్రకారం యూస్‌‌పీ 50ఎంజీ/12.5 ఎంజీ లోసర్టన్ పోటాషియం/ హైడ్రోక్లోరోథియాజైడ్ టాబ్లెట్లకు చెందిన 17,088 బాటిళ్లను టోరెంట్ఇంక్ రీకాల్ చేస్తోంది. ఇవే టాబ్లెట్ల యూఎస్‌‌పీ100ఎంజీ, 25ఎంజీకి చెందిన 8,688 బాటిళ్లను రీకాల్ చేస్తున్నట్టు యూఎస్‌‌ఎఫ్‌‌డీఏ రిపోర్ట్‌‌లో తెలిపింది.

Latest Updates