ప్రేమించి పెళ్లి చేసుకుని..భూతవైద్యమంటూ చిత్రహింసలు

కరీంనగర్: కరీంనగర్లో దారుణం జరిగింది. భూత వైద్యం పేరుతో భార్యను చిత్రహింసలు పెట్టాడు ఓ భర్త .చివరికి చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో ఉంది ఆ  యువతి . శంకరపట్నం మండలం గద్దపాకకు చెందిన యువతిని మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం గ్రామానికి చెందిన మల్లేశ్ అనే యుకువడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు .వీరికి ఇటీవలే ఓ బిడ్డ పుట్టింది. ఆ తర్వాత యువతి అనారోగ్యానికి గురికావడంతో భూతవైద్యం పేరుతో  చిత్రహింసలు పెట్టాడు ఆ భర్త. ఆ యువతిని కరీంనగర్ ఆస్పత్రికి తీసుకువచ్చిన మల్లేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు.ప్రస్తుతానికి ఆ యువతి చావు బతుకుల మధ్య ఉంది. మల్లేశ్ సెల్ ఫోన్లో యువతిని భూతవైద్యుడు కొడుతున్న వీడియోలు లభ్యమయ్యాయి . ప్రేమ పేరుతో  మల్లేశ్ మోసం చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు.

see more news

దేశంలో ఒక్కరోజే 57 వేల కరోనా కేసులు

యువతలో కరోనా ముప్పు ఎక్కువే!

Latest Updates